Shri Veda Bharathi శ్రీ వేద భారతి
Dr. RVSS Avadhanulu
శ్రీవేదభారతి నుండి మిత్రులందరకు నమస్కారములు.
పరమేశ్వరుని అనుగ్రహంతో, శ్రీవేదభారతి దశాబ్దాలుగా చేస్తున్న కృషిలో భాగంగా, దృష్టిలోపం గల విద్యార్థులకు గణితవిజ్ఞానాన్ని అందించాలనే తపనతో "బ్రెయిలీలో వేదగణితం (ఇంగ్లీషు)" 5 సంపుటాలను (volumes) ముద్రించడం జరిగింది. వీటితోపాటు లీలావతీ గణితం 5 పుస్తకాలనూ, ఆర్యభటీయం (1 వ భాగం) పుస్తకాలనూ, జూమ్ మాధ్యమం ద్వారా బోధించిన తెలుగు లో వీడియో పాఠాలు ఉన్న పెన్ డ్రైవునూ కూడా సిద్ధం చేయడం జరుగుతోంది.
ఈ అపూర్వ గ్రంథాలనూ, పెన్ డ్రైవులనూ 17.12.2023 నాడు "సప్తపర్ణి గోశాలా ప్రాంగణంలో ఆవిష్కరణ కు మహానుభావులు దయతో అంగీకరించారు. ఈ ప్రదేశం నాగోల్ కు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమీర్ పేట నుండి కారులో గంటన్నర ప్రయాణం! ఆ మహోత్సవ కార్యక్రమంలో సకుటుంబ బంధుమిత్ర పరివారముగా పాల్గొనవలసినదిగా మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆహ్వాన పత్రాన్ని దీనితో పంపిస్తున్నాము. తమరు తప్పక రాగోరిక!!!
వాహనసదుపాయము కావాలనుకొనేవారికి క్రింది ప్రదేశములనుండి సంఖ్యనుబట్టి ఏర్పాటు జరుగుతుంది.
అమీర్ పేట, (మధ్యాహ్నం గం.2.30కు బయలుదేరాలి) తార్నాక (గం.3.00కు) ఎల్ బి నగర్.(గం.3.00కు)
అక్కడ (ముందుగా) గోశాల దర్శనం, వేద విద్యార్థుల వేదగణిత ప్రదర్శనం కూడా ఉంటాయి. అందుచేత అక్కడకు గం. 4.30 లోగా జేరాలి.
తమరు వస్తున్న విషయాన్ని ( తమ పేరు, సంఖ్య తో సహా), ధృవీకరిస్తూ,, ఏ విధంగా రాదలచుకొన్నదీ కూడా తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాము!!
తమ పరిచయస్థులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.
మరిన్ని వివరాలకు: +91 98846 08613
ఇట్లు డా.రేమెళ్ల అవధానులు 98494 59316.
Click here to read feedback from our guests
Thought of the Day
Read More >>
ABOUT
About Us Awards Contact Us Team
Follow Us
COURSES
Brahma Sutra Sankara Bhashyam Sri Rudra Bhashyam Aryabhatiyam – Bijaganitam Bhagavad Gita Sankara Bhashyam Vedic Mathematics
ENGAGE
Product Store Donate Events Collaborate Resources Forum Submit Testimonial
OTHERS
Gallery Recent Updates News Media Blog Publications
Powered By