|
Computer Lab Setup in Veda Patasala |
ఇక, మన రెండు రాష్ట్రాలలోను ఉన్న వేద పాఠశాలలలో చాలా మంది విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో వేదాలను, శాస్త్రాలను, కఠోర సాధనతో, అధ్యయనం చేస్తున్నారు. ఆ చదువు అయిన తర్వాత, చాలా మంది వాటికే పరిమితం అవుతున్నారు. వారు ఆధునిక విజ్ఞానానికి చాలా దూరంగా ఉండడం జరుగుతోంది. వారికి చిన్న వయసు నుండి ఆధునిక పరిజ్ఞానాన్నికూడా అందిస్తే వారి భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని పీఠాధిపతులు, తల్లిదండ్రులు, ఇంకా చాలా మంది పెద్దలు భావిస్తున్నారు. అందుచేత, వారి ప్రధానమైన వేద విద్యకు ఆటంకం లేకుండా, వేద విద్యార్థులకు కంప్యూటర్ ZOOM ద్వారా, వేదగణితం, కంప్యూటర్ విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం, ఆంగ్లం, మొదలైన వివిధ ఆధునిక అంశాలతో బాటు, సంస్కృతానికి కూడా చెందిన పరిచయ తరగతులను, ఒక క్రమ పద్దతిలో, నిర్వహించాలని శ్రీ వేద భారతి సంకల్పించింది. ఇది చివరకు వేదపాఠశాలల యాజమాన్యం వారి ఆసక్తి, అభిరుచి, అభిలాష పై ఆధారపడి ఉంటుంది. కనుక, ఈ పాఠశాలల యాజమాన్యం వారిని అందరినీ ఈ తరగతుల విషయంలో తమ విద్యార్థులను ప్రోత్సహించ వలసినదిగా కోరుచున్నా ము. తగిన ఏర్పాట్లు కూడా చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ఈ పవిత్ర జ్ఞానయజ్ఞంలో పాల్గొనడానికి ముందుగా మూడు వేద పాఠశాలలు (శ్రీశైలం -శ్రీ దేవీ వేద విద్యాలయం, మల్కాజిగిరి, చిప్పలపల్లి పాఠశాలలు) ముందుకు వచ్చేయి. | శ్రీ వేద భారతి మిత్రులు అందరికీ నమస్కారాలు. విషయం: వేద విద్యార్థులకు ఆధునిక విజ్ఞాన పరిచయ తరగతులు- ఆసక్తి గల వారికి ఆహ్వానం చదువుల తల్లి సరస్వతీ మాత పవిత్ర ఆవిర్భావ దిన శుభ (వసంత పంచమి), సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు!!! " ప్రాచీన భారతీయ విజ్ఞానం మరియు విలువలు " అనే అంశంపై మన ఉన్నత పాఠశాలల విద్యార్థులకు భారతీయ సంస్కృతికి చెందిన వేదగణితం, రామాయణం , భాగవతం, మహాభారతం, నీతి కథలు, మహా పురుషుల జీవిత చరిత్రలు మొదలైన అనేక విషయాలపై శ్రీ వేద భారతి గత మూడు సంవత్సరాలుగా జూమ్ (నెట్) మాధ్యమంగా శిక్షణా తరగతులను (7 వర్గ లను) నిర్వహించడం జరిగింది. వందలాది విద్యార్థులు పాల్గొన్నారు, తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. అయితే వీరిలో మన వేద విద్యార్థులు ఎవరూ చేరలేదు. ఆ అవకాశాన్ని వారికి మనం కల్పించలేకపోయాము. ముందుగా ఈ మూడు పాఠశాలలలోను కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. ఆ కంప్యూటర్ పరికరాల వివరాలను సేకరించి దీనితో జతచేయడం జరిగింది. ఒక్కొక్క పాఠశాలకు పరికరాలకు, అనుబంధ ఖర్చులకు కలిపి సుమారు రు.1 లక్ష 25వేలు అవుతుందని అంచనా. వాటిని కొనడానికి యథాశక్తి ఆర్థిక సహాయం చేయవలసిందిగా మన మిత్రులు అందరినీ అభ్యర్థిస్తున్నాము. స్పందనను బట్టి, అతి త్వరలోనే, వీలయితే ఈ మాఘ మాసం లోనే, ప్రారంభం చేద్దామని ఉందని మనవి చేసుకుంటున్నాము. ఈ తరగతులలో ఆసక్తి ఉన్న మిగిలిన వేద పాఠశాలలను / వేద విద్యార్థులను కూడా జేర్చుకొనుటకు ఏమీ అభ్యంతరం లేదు. అయితే పరికరాలకొరకు వారే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సమాచారాన్ని వేదపాఠశాలలన్నింటికీ జేరునట్లుగా ఆసక్తి గల వారందరూ విస్తృతంగా ప్రచారం చేయగోరిక. ఈ తరగతులలో జేరదలచిన వారు తమ పేరు, పాఠశాల ఎడ్రస్, ఫోను నంబరు, ఈ క్రింది నంబరుకు వాట్సప్ ద్వారా తెలుపగోరిక. పైన పేర్కొన్న పరికరాలను కొనడానికి, కార్యక్రమాలను నిర్వహించడానికి, విరాళాలను ఈ క్రింది విధంగా పంపవచ్చును.. |
Donation Campaigns |
Donate a Projector for Shri Veda Bharathi is working on digital class room program for veda patasala students. | Sponser for one Computer for modern science introductory classes for vedic students. | Donate Computer Lab Equipments Computer lab setup program is to provide modern science introductory classes for vedic students. |
Donate a Computer or Laptop that will be used in modern science introductory classes for vedic students. | Digital Class Room in Shri Veda Bharathi is working on digital class room program for veda patasala students. |