శ్రీ వేద భారతి మిత్రులు అందరికీ నమస్కారములు.
మన చిరంజీవుల " ప్రతిభ" ను వృద్ధి చేయడానికి, ఇంతకు ముందు," వేదగణణితం", " లీలావతీగణితం" వంటి అంశాలపై చాలా సార్లు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది.
అయితే, "విషయ విజ్ఞానం" తో బాటు, "వ్యక్తిత్వ వికాసం" కూడా కావలసి ఉంది. అందులో భాగంగా, "దేశభక్తి", "త్యాగ శీలత" "నీతి, నిజాయితి" "ఆత్మ గౌరవం", "మన ప్రాచీన సాహిత్య జ్ఞానం", "సహనం" మొదలయిన "విలువలు" కూడా సరియైన జీవనానికి అత్యవసరం. అవి లోపించడం కారణంగా ఇంటా, బయటా సమస్యలు ఎదురవు తున్నాయి.
పిల్లలకు మంచి నడవడికను చిన్నప్పుడే నేర్పవలసిన బాధ్యత మన అందరిపైనా ఉంది. నిజానికి కొందరు పెద్దలు కూడా ఇవి నేర్చుకోవలసిన అవసరం కనిపిస్తోంది.
ఈ కారణాల దృష్ట్యా, పిల్లల శ్రేయస్సును కోరుకుంటూ, ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచనతో, తపనతో, శ్రీ వేదభారతి 2024 మే నెల, 3 వ తేదీనుండి," "సౌశీల్య Personality Development Online Course 2024" అనే శీర్షికతో 20 తరగతులను (జూమ్) తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వేరు వేరుగా నిర్వహించాలని నిర్ణయించడ మైనది.
కోర్సు ఆవశ్యకత, వివరాలు, సిలబస్ మొదలయినవి దిగువున ఇచ్చిన గూగుల్ లింక్ ద్వారా తెలుపబడినవి.
ఎక్కువమంది కి అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో, ఒక్కొక్క విద్యార్థి కి రుసుము రు.500/- మాత్రమే నిర్ణయించబడింది.
చిరంజీవుల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకొని, తమ చిరంజీవులను ఈ కోర్సులో జేర్పించగోరిక. దాని ద్వారా ఒక తరాన్ని రక్షించు కోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళము అవుతాము!!!
దానికి మీ ప్రోత్సాహమును అందించ వలసినదిగా ప్రార్థన !!!
గూగుల్ ఫారం లింక్:
https://forms.gle/mrFwjHqNtG2a5Rt38
..............................................
Dear friends,
Shri Veda Bharathi (SVB) has been conducting several training programmes to the students of various standards, on various topics for the past several years. The subjects include Vedic mathematics, Astronomy, Ayurveda, Lilavati Ganitam, etc. All the subjects have decisively helped the participants in improving their knowledge.
In the present day conditions, the youth are not having any occasion to know their own family relations and social responsibilities. They are not aware of good behavioural patterns and appreciable mannerisms needed for them in their future personal and public life.
Hence ‘Sousilya Personality Development Online Course 2024”, (ZOOM) with 20 sessions in both Telugu and English separately, is planned for the benefit of the children and youth from 3rd May 2024.
The fee per student is kept as Rs.500/- only, to encourage as many participants as possible.
All parents are requested to join their children in the course for the benefit of the individuals and the country.
The Google link giving the course details is provided below.
Google link:
https://forms.gle/mrFwjHqNtG2a5Rt38