శ్రీ వేదభారతి మిత్రులందరకు నమస్కారాలు.
క్రిందటి నెలలో హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. కరోనా కారణంగా 2020 నుండి 2023 వరకూ మనం పాల్గొనలేదు. చాలామంది స్నేహితులు, పరిచయస్థులు, ఎంతో అభిమానంతో, మన స్టాల్ కు వచ్చి 75 రకాల పుస్తకాలు, 50 రకాలు పైన గల వేదాల/భాష్యపాఠాలు మొదలైనవి ( ఆడియో, వీడియో ఫైల్స్), నేత్ర సమస్య ఉన్నవారికి మనం తయారుచేసిన బ్రెయిలీ పుస్తకాల సెట్లను (5 సంపుటాలను) పరిశీలించి, వారికి నచ్చినవి తీసుకొని మన సంస్థను యథాశక్తి ఆదరించారు. ఇప్పుడు బ్రెయిలీ పుస్తకాల ప్రచురణ, పంపిణీ లపై పెద్ద ఉద్యమం చేస్తున్నాము.
అయితే, కారణాంతరాల వలన రాలేకపోయిన స్నేహితులకు ఒక చిన్న సూచన-
మన పుస్తకాలను, వేదాలయొక్క/ వివిధ అంశాలపై మన పాఠాల ఆడియో, వీడియోలను తమకొరకు మాత్రమే గాక, , సహృదయులకు, స్వదేశీయ, విదేశీయ మిత్రులకు, శబ్దవేదము వంటి గ్రంథాలను దేవాలయాలకు, లైబ్రరీలకు కూడా యథాశక్తి తీసుకొని అందించినచో, మనము చేపట్టిన వేద పరిరక్షణ, వేదవిజ్ఞాన ప్రచారము లకు విస్తృతమైన ప్రచారము, సహాయము చేసిన వారు కాగలరనే అభిప్రాయము తో ఈ మెసేజ్ పంపిస్తున్నాము.
(ఇంతకు పూర్వం చాలా సార్లు అనేక పవిత్ర కార్యాలకు విరాళాలను అందించి ఉన్నారు. ఆ సహకారాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమే!).
ఈ 2024మార్చి31 వ తేదీ లోగా,
వెబ్ సైట్ ద్వారా గాని, ఇ మెయిల్ ద్వారాగాని, ఫోను ద్వారాగాని, డైరెక్ట్ గా గాని, తమకు కావలసిన వాటిని తెలిపినచో, పోస్టు ద్వారా గాని, పెన్ డ్రైవ్ ద్వారాగాని, గూగుల్ డ్రైవ్ ద్వారాగాని కూడా పంపడానికి వీలుంది. దీనితో బాటు కేటలాగు, ఎక్కౌంటు వివరాలు కూడా జతచేయబడ్డాయి.
https://www.shrivedabharathi.in/Online-Store
www.shrivedabharathi.in
shrivedabharathi@gmail.com
గమనించగోరిక.
డా.రేమెళ్ల అవధానులు
ఇంకా వివరాలకు:
కార్యదర్శి,( శ్రీ వేద భారతి)
+91 98846 08613
+91 95157 31843